![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -335 లో... అక్క నువ్వు చదువుకున్నావ్ కదా జాబ్ చెయ్ అని శ్రీవల్లితో ప్రేమ అంటుంది. అత్తయ్య గారికి హెల్ప్ చెయ్యాలి కదా అందుకే జాబ్ చెయ్యడం లేదని శ్రీవల్లి బిల్డప్ ఇస్తుంది. అంటే నువ్వు హెల్ప్ చెయ్యకపోతే నేను పనులు చేసుకోలేనా.. నువ్వు వెళ్ళవే రేపటి నుండి జాబ్ కి అని వేదవతి అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.
ఇక అందరు అంత చదువు ఎందుకు వేస్ట్ చేసుకుంటావని అంటారు. మీరందరు కాదు మావయ్య గారు ఒక్కమాట చెప్తే రేపే జాబ్ కి వెళ్తానని శ్రీవల్లి అనగానే.. అయితే వెళ్ళమ్మా నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు వద్దని అంటానని రామరాజు అంటాడు. దాంతో శ్రీవల్లికి దిమ్మ తిరుగుతుంది. అక్క మావయ్య ఒప్పుకున్నాడు కదా ఇక నువ్వు నీ సర్టిఫికెట్ తెచ్చుకో జాబ్ కి అప్లై చేద్దామని ప్రేమ అంటుంది.
ఆ తర్వాత సాగర్ వర్షంలో తడుస్తూ ఆలోచిస్తుంటాడు. నర్మద వచ్చి తనని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఏమైంది అంతగా ఏం ఆలోచిస్తున్నావు.. నా గురించి అని తెలుసు నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నానని నర్మద అంటుంది. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని సాగర్ బాధపడతాడు. ఆ తర్వాత శ్రీవల్లి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి తిడుతుంది. మీరు చెప్పిన ప్రతీ అబద్ధం ఇప్పుడు నాకూ టార్చర్ గా ఉందని అంటుంది.
మరొకవైపు ప్రేమకి ధీరజ్ పోలీస్ డ్రెస్ తీసుకొని వస్తాడు. అప్లై చేసినంత మాత్రాన జాబ్ వచ్చినట్లు కాదని ప్రేమ అనగానే నీకు ఖచ్చితంగా వస్తుందని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ మురిసిపోతుంది. ప్రేమని డ్రెస్ వేసుకొని రమ్మని అనగానే ప్రేమ వస్తుంది. యూనిఫామ్ లో ప్రేమని చూసి ధీరజ్ ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |